AMARAVATHI

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా ముఖ్య ఎన్నికల అదికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు..సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశామన్నారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని,, పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారని తెలిపారు.. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉండడంతో ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించామన్నారు.. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని,,11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేయడంతో అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించామన్నారు. ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని,మంగళవారం సంబంధిత జిల్లా ఎన్నికల,రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించిన తరువాత స్పష్టం వివరాలు తెలియచేస్తామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *