నెల్లూరు: ఉదయగిరి నారాయణ మృతికి సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు జిల్లా పోలీసులకు చేతకాకపోతే బహిరంగంగా ప్రకటించాలని,,తాము సిబిసిఐడి లేదా జ్యుడీషియల్ ఎంక్వైరీ సాధిస్తామని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు..గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ చలో నెల్లూరు సందర్భంగా టిడిపి నాయకులను ఎక్కడెక్కడ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. కనీసం నిరసన తెలియజేసే హక్కు కూడా కాలు రాశారని విమర్శించారు..చివరకు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కూడా సోదాలు చేపట్టడం ఏమిటని ఆయన పోలీస్ అధికారులను ప్రశ్నించారు..ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.పార్టీ కార్యాలయంలో పోలీసులకు ఏం పని అంటూ ప్రశ్నించారు..రెండు మూడు వేల రూపాయల దొంగతనాన్ని ఉదయగిరి నారాయణ పై మోపి ఆయన్ని కొట్టి చంపేశారని, చనిపోయిన మూడు రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారని తెలిపారు.. ఉదయగిరి నారాయణ కుటుంబ సభ్యుల సంప్రదాయం ప్రకారం వారి మృతదేహాన్ని పూడ్చి పెట్టాలని, కానీ పోలీసుల అత్యుత్సాహంతో ఉదయగిరి నారాయణ మృతదేహాన్ని కాల్చేశారని తెలిపారు..ఉదయగిరి నారాయణ చనిపోయినప్పుడు మర్మాంగాల నుంచి, రక్తం కారుతోందని ఉరి వేసుకుని వేలాడుతున్న వ్యక్తి చెప్పులతో వేలాడుతున్నాడని ఇవన్నీ అనుమానాస్పదమైన సంఘటనలేనని తెలిపారు..అతని మరణం ఎలా జరిగిందో తెలుసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు..చట్టానికి ఎవరు అతీతులు కాదని, పోలీసులు తప్పు చేసుంటే పోలీసులకు కూడా శిక్ష పడాలన్నారు..వారి కుటుంబ సంప్రదాయకు విరుద్ధంగా,,అయన మృతదేహాన్ని కాల్చే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు..కార్యక్రమంలో మన్నెం పెంచల్ నాయుడు, కనపర్తి గంగాధర్, సాబీర్ ఖాన్, శివాచారి, నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు..