NATIONAL

జవహర్ లాల్ నెహ్రూ పేరును గాంధీ కుటుంబ సభ్యులు,పేర్ల చివరిన ఎందుకు పెట్టుకోవడం లేదు-ప్రధాని మోదీ

అమరావతి: వ్యపార దిగ్గజం గౌతమ్ అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోఫణపై ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తూ ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి..గురువారం నాడు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడేప్పుడు కూడా విపక్షాలు అడ్డుతగిలాయి..విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు..నేడు రాజ్యసభలో ప్రధాని మోడీ,, గాంధీ ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపించారు.. భారతదేశ తొలి ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ పేరును గాంధీ కుటుంబ సభ్యులు తమ పేరు చివర్లో ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు..వాళ్లు  ఎందుకంత అవమానకరంగా భావిస్తున్నారో నాకు  అర్థం కావడం లేదన్నారు..తామెక్కడైనా నెహ్రూ పేరు ప్రస్తావిస్తే గాంధీ కుటుంబ సభ్యులు  అవమానకరంగా భావిస్తారని వెల్లడించారు..నెహ్రూ అంత గొప్ప వ్యక్తి అయితే గాంధీ కుటుంబ సభ్యులు నెహ్రూ పేరును  ఎందుకు పెట్టుకోరు,,,,పెట్టుకుంటే వారికి సిగ్గు చేటా.? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.. ‘ప్రభుత్వ పథకాలకు కొందరి వ్యక్తుల పేర్లు, సంస్కృత పదాలు ఉండటంతో సమస్యలు ఉన్నాయన్నారు.. గాంధీ,, నెహ్రూ కుటుంబాల పేరు మీద 600 ప్రభుత్వ పథకాలు ఉన్నాయని,,ఈ విషయం నేను ఒక రిపోర్టులో చదివాన్నన్నారు..మరి వారి తరం నుంచి వచ్చిన వారు నెహ్రూని ఇంటిపేరుగా ఎందుకు పెట్టుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. భయమా? లేక  అవమానమా?’ అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *