రాజకీయాల్లో హత్యలు వుండవు,ఆత్మహత్యలే వుంటాయి-మంత్రి కాకాణి

నెల్లూరు: రాజకీయాల్లో హత్యలు వుండవు,కేవలం ఆత్మహత్యలే వుంటాయన్న సంగంతి రూరల్ ఎమ్మేల్యే గుర్తుంచుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి అన్నారు.శుక్రవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న శ్రీధర్ రెడ్డి,కోర్టుకు,కేంద్ర హోంశాఖకు దృష్టికి ఎందుకు తీసుకుని వెళ్లడంలేదని ప్రశ్రించారు..ఎందుకంటే అది రికార్డింగ్ వాయిస్ మాత్రమే అన్న విషయం రూరల్ ఎమ్మేల్యేకు తెలుసన్నారు.