MOVIENATIONAL

68వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు

హైదరాబాద్: 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది.. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి..ఈ సంవత్సరం మొత్తం 30భాషల్లో 305 ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంట్రీకి వచ్చినట్లు జ్యూరీ సభ్యులు పేర్కొన్నారు..నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటరిగిలో 20భాషల్లో 148 చిత్రాలు స్క్రీనింగ్‌కు వచ్చినట్లు తెలిపారు..అవార్డులను 5 కేటగిరీలుగా విభజించారు..దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్‌ (28 కేటగిరీలు), నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ (22 కేటగిరీలు), బెస్ట్‌ రైటింగ్‌ సెక్షన్‌, మోస్ట్‌ ఫిల్మ్‌ఫ్రెండ్లీ స్టేట్‌ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు..ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కలర్‌ ఫొటో ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో నాట్యం’ చిత్రం ఎంపిక కాగా, ఉత్తమ సంగీత చిత్రంగా అలవైకుంఠ పురములో అవార్డులు దక్కించుకున్నాయి..2020 జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి..2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ చలనచిత్ర అవార్డుల దక్కించుకున్న వారి జాబితా:-

ఉత్తమ చిత్రం :  సూరయైపొట్రు’  

ఉత్తమ నటుడు : సూర్య ,అజయ్ దేవగణ్ 

ఉత్తమ నటి :  అపర్ణ బాలమురళి 

ఉత్తమ దర్శకుడు :  కె. ఆర్. సచ్చిదానందన్  (అయ్యప్పమ్ కోషియమ్)

ఉత్తమ సహాయనటుడు :బిజుమీనన్ ( అయ్యప్పమ్ కోషియమ్ )

ఉత్తమ సహాయ నటి – లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్‌ సిలా పెంగలుమ్‌)

ఉత్తమ బాల నటుడు –  వరున్‌ బుద్దదేవ్‌(తులసీదాస్ జూనియర్‌)- స్పెషల్‌ మెన్షన్‌

ఉత్తమ నేపథ్యం సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్

బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – నచికేట్‌ బర్వే, మహేష్‌ షేర్లా(తానాజీ)

బెస్ట్ లిరిక్‌ – సైనా(మనోజ్‌ మౌతషిర్‌)

మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ – మధ్యప్రదేశ్‌

బెస్ట్‌ స్టంట్స్‌ – అయ్యప్పనుమ్‌ కోషియమ్‌

బెస్ట్‌ కొరియోగ్రఫీ – నాట్యం (తెలుగు)

ఉత్తమ డ్యాన్సర్‌: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)

ఉత్తమ సంగీత దర్శకుడు – తమన్‌ (అల వైకుంఠపురములో)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *