800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా-ప్రస్తుతం భారతదేశం జనాభా 141.2 కోట్లు

అమరావతి: ప్రపంచ జనాభా మంగళవారం నాటికి 800 కోట్లు దాటిందని,ఇది మానవాళి చారిత్రలో ఒక మైలురాయి అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. వైద్యం,పోషణ, వ్యక్తిగత శుభ్రతతో సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి,,ఆయుర్దాయం గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం సంతానోత్పత్తి తగ్గడం పడిపోతుండటం కారణంగా ప్రపంచ జనాభా పెరుగుదల తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ జనాభాలో సగం మంది కేవలం 7 దేశాల్లోనే ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది.చైనా,భారత్,అమెరికా,పాకిస్తాన్,నైజీరియా,బ్రెజిల్ లో ప్రస్తుతం అధిక జనాభా నమోదు అవుతున్నట్లు వెల్లడించింది.1990 నుంచి అయుర్దాయం పెరుగుతొందని,2019 నుంచి సగటు వ్యక్తి ఆయుర్దాయం 72.8 కాగా అధునిక వైద్యం సేవాలు పెరగడంతో 2050 నాటికి ఆయుర్దాయం 77.2 కు చేరుకుంటుందని ఐరాస ప్రకటించింది.ఇదే సమయంలో కొన్ని కారణల వల్ల సంతానోత్పత్తి తగ్గడంతో ప్రపంచ జనాభా పెరుగుదల నెమ్మదించిందని తెలిపింది.రాబోయే రోజుల్లో 100 కోట్ల జనాభా పెరుగుదల కాంగో,ఈజిప్ట్,ఇథియోపియా,భారత్,నైజీరియా,పాకిస్తాన్,ఫిలిప్పిన్స్,టాంజానియా దేశాల్లో వుంటుందని పేర్కొంది.ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన దేశంగా వున్న చైనాను,వచ్చే సంవత్సరం నాటికి భారత్ అధికమిస్తుందని తెలిపింది.ప్రస్తుతం భారతదేశంలో 141.2 కోట్ట మంది వుండగా,2050 నాటికి దాదాపు 170 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.205 నాటికి చైనా జనాభా 130 కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది.వేగంగా పెరిగే జనాభా కారణంగా పేదరికం,ఆకలి సంక్షోభం,పోషకాహారలోపం,విద్య,వైద్యంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొవల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.