గ్రామదేవతలను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే-గరికపాటి నరసింహారావు

నెల్లూరు: దేశ ప్రజల శాంతి, సుఖ, సంతోషాల కోసమై సాంస్కృతిక శాఖ ద్వారా దేశంలోని వివిధ దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.కార్తీక పౌర్ణమి సందర్బంగా సోమవారం సాయంత్రం నగరంలోని గణేష్ ఘాట్ లో కార్తీక దీపోత్సవ సమితి నేతృత్వంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సయోధ్యగా కలిసిమెలిసి ఉండడానికి అత్యంత అనువైన మార్గం ఆధ్యాత్మిక భావనయే నన్నారు.ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసమని, సంస్కృతి, సంస్కారం, సందేశం ఇమిడి ఉండే దీపం అర్ధాన్ని వివరించారు. ఉపవాస దీక్ష వల్ల కలిగే ఉపయోగాలు వివరిస్తూ ఆధ్యాత్మికo, ఆరోగ్యo మేళవించి చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది.ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ గ్రామ దేవతలతో మనకు బంధుత్వం ఉంటుందని, అటువంటి గ్రామదేవతలను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనన్నారు. హిందూ సాంప్రదాయం వైజ్ఞానిక సాంప్రదాయమన్నారు. తొలుత నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద, ప్రవచనకర్త పద్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు ల సమక్షంలో స్వర్నాల చెరువులో గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రతేకంగా ఏర్పాటు చేసిన పడవలలో దాదాపు వంద మంది మత్స్యకారులు తో స్వర్నాల చెరువు కార్తీక దీపాలతో తళుకుళీనింది. శివ నామ స్మరణ తో గణేష్ ఘాట్ పరిసరాలు మార్మోగాయి.