చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 3వ సారి ఎంపికైన షీ జిన్ పింగ్

అమరావతి: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ వరుసగా 3వ సారి అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు..గతంలో ఈ రికార్డు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ పేరుపై మాత్రమే ఉంది. జిన్ పింగ్ 2012, నవంబరు 15 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. చైనా అధ్యక్షుడిగా ఆయన 2013, మార్చి 14వ తేదిన మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. రెండోసారి కూడా ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023 మార్చిలో మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.అనంతరం అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఆదివారం చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల్లో, స్టాండింగ్ కమిటీ,, షీ జిన్ పింగ్ ను తమ నాయకుడిగా తీర్మానించి,అధికారికంగా ప్రకటించింది.తన పదవీకి పోటీ రాకుండా,కమ్యూనిస్టు పార్టీలో దిత్వీయ శ్రేణి నాయకులైన ప్రధాని, పొలిట్‌బ్యూరో, స్టాండింగ్ కమిటీ సభ్యులను శనివారం నాడే వారి పదవుల నుంచి షీ జిన్ పింగ్ తప్పించేశారు. పార్టీ సెంట్రల్ కమిటీ 25 మంది నాయకులతో కొత్త పొలిటికల్ బ్యూరోను ఎన్నుకుంది. నిజానికి చైనా అధ్యక్షుడిగా నేత 68 ఏళ్ల వయసు వచ్చే వరకే కొనసాగాలి. ఇప్పుడు షీ జిన్ పింగ్ కి 69 ఏళ్లు. తానే చైనా అధ్యక్షుడిగా ఉండాలన్న దురాశతో జిన్ పింగ్ 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. మూడోసారి కూడా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు.
Libtard Indians who think they are living in a ‘fascist regime’ since 2014 should see this in a loop! THIS is what intolerance looks like. pic.twitter.com/MgxXg4iuNY
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) October 23, 2022