నెల్లూరు: రెండు సెంట్లు భూమిని ఆక్రమించినందుకు అయ్యన్నను అరెస్ట్ చేస్తే, 200 ఎకరాలు ఆక్రమించిన వైఎస్ కుటుంబాన్ని ఏం చేయాలి,,175 కి 175 సీట్లు ఓడిపోతున్నామన్న ఫ్రస్టేషన్లో జగన్మోహన్ రెడ్డి దిగజారుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మాజీ మంత్రివర్యులు అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నగరంలోని అంబేద్కర్ విగ్రహనికి తెలుగుదేశం పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించి అనంతరం కూడలిలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ టిడిపి జనసేన కలయికతో వైసిపి ఓడిపోతుందన్న భయంతో అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని,,జగన్మోహన్ రెడ్డి కింద జీతగాళ్లలా మారిన కొంత పోలీసుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ పై మధ్య పడిందని అన్నారు. ఆంధ్ర పోలీసులకు అసలైన నేరస్తులను దోపిడీదారులను శిక్షించే ధైర్యం లేదని కేవలం నిరసన తెలిపే వారి మీదే అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. విశాఖ నగర చుట్టుపక్కల ప్రాంతాల లో 20 వేల ఎకరాలు వైసీపీ నాయకుల చేత దోపిడీ కు గురైందనీ దాన్ని ప్రశ్నించడం అయ్యన్న చేసిన తప్పా? మూడున్నర ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులు 2 లక్షల కోట్లు దోచుకు తింటుంటే టీడీపీ నాయకులు ప్రశ్నించకుడదా అంటూ నిలదీశారు.ఈ కార్యక్రమంలో బీద రవిచంద్ర,నగర నియోజకవర్గ ఇంచార్జీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి కురుగొండ్ల రామకృష్ణ, మురళి కన్నబాబు, సతీష్ రెడ్డి, తాళ్ళపాక అనురాధ,రేవతి, జెన్నీ రమణయ్య, గంజాం రాఘవేంద్ర,పీ ఎల్ రావు,కప్పిర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు