x
Close
HYDERABAD POLITICS

రాబోయే ఎన్నికల్లో 45 నుంచి 67 స్థానాలకే వైసీపీ పరిమితం-పవన్ కళ్యాణ్

రాబోయే ఎన్నికల్లో 45 నుంచి 67 స్థానాలకే వైసీపీ పరిమితం-పవన్ కళ్యాణ్
  • PublishedSeptember 18, 2022

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ తన హీరో అని,,ఆయనపై అపారమైన గౌరవం ఉందన జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు..ఆదివారం లీగల్ విభాగంతో సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ జనసేన లీగల్ విభాగానికి బాబా సాహెబ్ అంబేద్కర్ లీగల్ విభాగం అని పెట్టడానికి కారణం ఆయన పైన ఉన్న అపార గౌరవమే అన్నారు..వెనుకబడిన,, అణగారిన కులాలకు అండగా ఉంటానని మాట ఇచ్చానని పవన్ పేర్కొన్నారు. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం అనే పదాలు చాలా బలమైనవని,ఒక మార్పు కోసం తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. 2019 ఓటమి తరువాత తాను పార్టీ వదిలిపెట్టి పోతానని అంతా భావించారని, అయితే తాను ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.తన వద్ద అపరిమిత ధనం లేదని, ప్రజల కోసం పని చేయాలనే తపన ఉందన్నారు.NTR లాంటి మహానటుడితో పోటీ పడలేమన్నారు. 9 నెలల వ్యవధిలో అధికారం చేపట్టాలనేది తన కోరిక కాదన్నారు.పాలసీపరంగా నిర్ణయాలు ఉండాలి తప్ప,వ్యక్తిగతంగా ఉండకూడదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ముందుకు వెళ్తానన్నారు. రాష్ట్ర విభజన తరువాత అన్నీ ఆలోచించే అప్పుడు టీడీపీకి మద్ధతు ఇచ్చానని వెల్లడించారు. ఆనాడు అమరావతి రాజధానిగా అంగీకరించి, నేడు 3 రాజధానులు అంటారా? అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు..బస్సు యాత్ర వాయిదా:- తాను చేపట్టనున్న బస్సు యాత్ర వాయిదా వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ, అక్టోబర్‌లో బస్సు యాత్ర చేపడతానని గతంలో ప్రకటించానని, కానీ, అన్ని రకాలుగా ఆలోచించి బస్సు యాత్ర వాయిదా వేస్తున్నామన్నారు. పార్టీ సన్నద్ధతపై మేధవుల నుంచి కొన్ని సూచనలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపికి రాబోయే ఎన్నికల్లో 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కానుందని సర్వేలు వచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో జనసేనకు ఆదరణ పెరుగుతుందన్నారు.. కౌలు రైతుల భరోసా యాత్ర జనసేన- జనవాణిని పూర్తి చేస్తామన్నారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.