నగరంలో భూ కబ్జాలు..
నెల్లూరు: నెల్లూరు నగరంలో ఈ భూ కబ్జా కోరులకు కొందరు రాజకీయ నాయకులు అండదండలుగా ఉన్నారంటూ స్వపక్షం నాయకులపై వైసీపీ వెంకటగిరి ఎమ్మేల్యే ఆనం.రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇక నుంచి నగరంలో ఎలాంటి భూబ్జా జరిగిన,బాధితులకు తాము అండగా వుంటామని ఆనం చెప్పారు. గురువారం నెల్లూరునగర 4వ పట్టణ పోలీసు స్టేషన్ వద్ద అయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవేణుగోపాలస్వామి కాలేజ్ కి సంబంధించి స్థలంలో ఒకు ఆక్రమించుకున్న సందర్బంలో,కాలేజ్ ఛైర్మన్,ఉద్యోగి,కలసి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగిందని తెలిపారు.కబ్జాదారులకు అండగా వుండే ఒక రాజకీయనాయకుడు సలహా మేరకు శ్రీ వేణుగోపాలస్వామి కాలేజ్ సిబ్బందిని పోలీసు స్టేషన్ వుంచడం దారుమణన్నారు.