ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది-చంద్రబాబు,పవన్

అమరావతి: ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు వైసీపీ అన్ని విధాల ప్రయత్నిస్తుందని,ఇలాంటి ధొరణి ప్రజాస్వామ్యంకు మంచిది కాదని,వైసీపీ అనుసరిస్తున్న ఆప్రజాస్వామ్య విధాలను ఎదుర్కొనేందుకు కలసి వచ్చే పార్టీలతో కలసి సమస్యలపై పొరాడేందుకు ముందుకు నడుస్తామని జనసేనా అధ్యక్షడు పవన్ కళ్యాణ్ అన్నారు.ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఏర్పాడలంటే,అన్ని పార్టీలు కలసి ప్రభుత్వం అనుసరిస్తూన్న ప్రజా వ్యతిరేక విధాలనపై ఉమ్మడి పోరాటం చేయాల్సి సమయం వచ్చిది అని టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు అన్నారు.చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంకు వెళ్లిన సమయంలో అయనను మానసికంగా హింసించడంతో పాటు వారి పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నరని మండిపడ్డారు.ముఖ్యమంత్రి ప్రతిపక్షలను హింసించి రాక్షసానందం పొందుతున్నరని ధ్వజమెత్తారు.తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన పాలను చూడలేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి,తాను బస చేసిన నోవాటెల్ హోటల్ కు చేరుకున్న సందర్బంలో,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ ను కలిశారు. 2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, విశాఖ పరిణామాలు, పోలీసుల చర్యలపై వారు చర్చించారు. విశాఖలో జరిగిన ఘటనలపై చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా పాల్గొన్నారు.పొత్తులపై మాట్లాడాల్సిన సమయం ఇది కాదని,ముందు ప్రజల సమస్యలపై పొరాటం చేయాల్సి వుందని,భవిష్యత్ లో ఇలాంటి విషయాలపై ఆలోచిస్తామని చంద్రబాబు చెప్పారు.