సుప్రీంకోర్టును ఆశ్రయించిన వై.ఎస్.సునీతరెడ్డి

అమరావతి: వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ కేసు విచారణ చేపట్టినా,, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని పిటిషన్లో పేర్కొన్నారు.. ఇకపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరిగేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు..ఏపీలో న్యాయం జరగకపోవడమే కాకుండా, తీవ్ర జాప్యం అయ్యే అవకాశాలున్నాయని,వేరే రాష్ట్రానికి వివేకా కేసు విచారణను తరలించాలని కూడా పిటీషన్‌లో సునీతా కోరారు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు..దాదాపు 500 పేజీల పిటిషన్ ను సుప్రీంకు సమర్పించారు..ఆమె పిటీషన్ త్వరలో విచారణకు రానుంది.