నెల్లూరు: స్పొర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కబడ్డీ(పురుషులు, మహిళలు), వాలీబాల్ (పురుషులు, మహిళలు), క్రికెట్( పురుషులు ),,బాడ్మింటన్ సింగిల్స్( పురుషులు, మహిళలు)బాడ్మింటన్ డబుల్స్ (పురుషులు, మహిళలు) క్రీడాంశాలలో “సి.యం.ప్రైజ్ మని టోర్నమెంట్” నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడమైనదని జిల్లా క్రీడాధికారి పుల్లయ్య తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి మొత్తంరూ 50.24 లక్షల నగదు బహుమతి ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పోటీల్లో బాడ్మింటన్ సింగిల్స్ , డబుల్స్ పోటీలు ఓపెన్ పద్దతిలో(వయోపరిమితి లేదు) మొదట జోనల్ స్థాయిలో తదుపరి రాష్ట్ర స్థాయిలో నిర్వహించుటకు నిర్ణయించడమైనదని తెలిపారు. జోన్-3 క్రింద గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు జోనల్ స్థాయి బాడ్మింటన్ పోటీలు తేది, 05-12-2022 న ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరులో నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో పాల్గొనుటకు క్రీడాకారులు “ SAAP Leagues ” యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని తేది 30-11-2022 లోగా తమ పేర్లను రిజిష్టర్ చేసుకొనవలసి ఉంటుందన్నారు.జిల్లాలోని బాడ్మింటన్ క్రీడాకారులు సి.యం. ప్రైజ్ మని టోర్నమెంట్ లో పాల్గొనేందుకు“ SAAP Leagues” యాప్ లో 30-11-2022 లోగా తమ పేర్లను నమోదు చేసుకొనవాలని కోరారు.ఇతర వివరములకు ఫోన్ నెం.9494492717 ( జి.వెంకటేష్, బాడ్మింటన్ కోచ్ )ను సంప్రదించ వచ్చన్నారు.