AMARAVATHIMOVIE

ది కేరళ స్టోరీకు 100% వినోదపు పన్ను మినహాయింపు-సీ.ఎం చౌహన్

అమరావతి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ది కేరళ స్టోరీ’ సినిమాపై కీలక నిర్ణయం ప్రకటించారు.. ఈ సినిమాకు 100% వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు..సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు..’ది కేరళ స్టోరీ’ చిత్రం లవ్ జిహాద్, మతమార్పిడి, ఉగ్రవాదం కుట్రలను వెలుగులోకి తెచ్చిందని,, దాని వికృత రూపాన్ని బయటపెడుతుందని చౌహాన్ అన్నారు..ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చామని చౌహాన్ వెల్లడించారు..ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, ముఖ్యంగా ఆడపిల్లలు తప్పకుండా చూడాలని చౌహాన్ కోరారు..అందుకే ఈ చిత్రానికి  వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చామని ఆయన తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *