DISTRICTS

ఈ నెల 12,  13వ తేదీలలో స్థానిక సెలవు దినం-కలెక్టర్

11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మందు బంద్…

నెల్లూరు: జిల్లాలో ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలతో పాటు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు ఈ నెల 12,  13వ తేదీలలో స్థానిక సెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఉత్తర్వులు అందాయని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.ఆ రోజుల్లో ఖజానా కార్యాలయాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు యధావిధిగా పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

11వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 13వ తేదీ పోలింగ్  ముగిసే సాయంత్రం 4 గంటల వరకు డ్రై డేగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు..జిల్లా వ్యాప్తంగా ఆ సమయంలో మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు, కల్లు దుకాణాలు అన్ని మూసి వేయడం జరుగుతుందని ఎటువంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు జరపరాదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.ఈ నిబంధనలు ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో,  పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో కచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *