AMARAVATHI

అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన 18 నెలలు-పవన్

అమరావతి: జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ విధానలపై విమర్శలు గుప్పిస్తున్నారు..2021 నవంబర్‌ 19వ తేదిన జల ప్రళయానికి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన దుర్ఘటనలో 23 మంది మరణించగా, 22 వేల ఎకరాల్లో పంట మునిగిందని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.. సంఘటన జరిగిన సమయంలో వైసీపీ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టారు..బాధితులకు మూడు నుంచి ఆరు నెలల్లో ఇళ్లు కట్టిస్తామని,, అన్నమయ్య డ్యామ్‌ పునర్‌నిర్మిస్తామని హామీ ఇచ్చారని వీడియోలో పేర్కొన్నారు..ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఓ హైపవర్ కమిటీ వేస్తున్నట్టు చెప్పరన్నారు.. ప్రమాద ఘటన జరిగిన నేటి 18 నెలలు గడుస్తున్నా బాధితులకు ఎదురు చూపులు,, రైతులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు..మాటలు మిన్న,,,ఫలితాలు సున్నా అంటూ ఎద్దేవా చేశారు.. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నమయ్య డ్యామ్ ప్రమాదంపై మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన హై లెవెల్ కమిటీ వేస్తున్నామని,, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారన్నారు.. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెశారో పబ్రిక్ డొమైన్ పెట్టాలని డిమాండ్ చేశారు..

రాజ్యసభలో కేంద్ర జలవనురుల శాఖ మంత్రి షకావత్ మాట్లాడుతూ అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారన్నారు..అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని గుర్తు చేశారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *