NATIONAL

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఇంటి నిర్మాణం కోసం రూ.52.71 కోట్లు

(తను సామాన్యుడని,,ఎలాంటి హంగు ఆర్భాటలు అవసరం లేదని,,అవినితిని దగ్గరకు రానివ్వనంటూ,,అన్నాహాజరే ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన క్రేజీవాల్,,అటు తరువాత కాలంలో రెండు సార్లు ఢిల్లీకి ముఖ్యంత్రి అయ్యాడు..అయిన కేబినేట్ లో మంత్రులు వందల కోట్ల అవినితి కుంభకోణంలో కురుకుని,,తీహార్ జైల్లో ఉచలు లెక్క పెడుతున్నారు.క్రేజివాల్ ఇచ్చిన ఎన్నికల హామీలతో అటు పంజాబ్ లోను ఆప్ అదికారంలోకి వచ్చింది..2020 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ప్రజలు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు.అదే సమయంలో ఢిల్లీలో ఆక్సిజన్ సిలెండర్స లేక పదుల సంఖ్యలో సామాన్య ప్రజలు ప్రాణాలు వదిలారు..ఇదే సమయంలో ప్రజల అవసరాలను కరోనా వైరస్ కు వదిలేసిన క్రేజీవాల్,,తన ఇంటికి హంగులు అద్దేందుకు దాదాపు రూ.52 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశాడంటే…అయనకు ప్రజల పట్ల వున్న ప్రేమ ఏలాంటిదో ఆర్దం చేసుకోవచ్చు?)

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇంటి ఆధునికీకరణ కోసం నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేశారని అరోపణలపై మీడియాలో కూడా కథనాలు రావడంతో విచారణ జరిపించి వెంటనే వాస్తవ నివేదికను సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు..దీనిపై విచారణ జరిపిన అనంతరం,, సీఎం కేజ్రీవాల్ ఇంటి ఆధునికీకరణకు రూ.52.71 కోట్లు ఖర్చు చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక సమర్పించింది..ఇందులో రూ.33.49 కోట్లను ఇంటి నిర్మాణానికి,, రూ.19.22 కోట్లను క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ఖర్చు చేసినట్లు నివేదిక సర్పించింది..

విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం తొలుత రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లతో పనులను పూర్తి చేయాలని అంచనా వేసిన ప్రజాపనుల విభాగం రూ.8.61 కోట్లకు టెండర్లను పిలిచి,,2020లో పనులను అప్పగించింది.. పనులు మొదలయ్యాక విలాసమైన సౌకర్యాల కోసం కొత్త ప్రతిపాదనలు చేయడం,,ఇందుకు అదనపు హంగులు(డోర్ కర్టెన్స్,,తివాచీలు,,టెబుల్స్,,ఇటాలియన్ ఫ్లోర్ మార్భుల్స్ లాంటివి తోడవడంతో అంచనా పెరుగుతూపోయింది..మొదట్లో ఉన్న ఇంటినే ఆధునికీకరించాలని అనుకున్నప్పటికి ఇలాంటి సౌకర్యాలు కల్పించేందుకు పాత భవనంను పూర్తిగా తొలగించి నిర్మించాల్సి వచ్చిందని ప్రజాపనుల విభాగం నివేదికలో పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *