AMARAVATHIMOVIE

గంగూబాయి కఠియావాడి’ చిత్రంకు 9 ఆవార్డులు

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 68వ ఎడిషన్..

అమరావతి: ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 68వ ఎడిషన్-2023’ వేడుక గురువారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది..జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ తారలు హాజరైయ్యారు..బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ హోస్టులుగా వ్యవహరించారు..ఈ సంవత్సరం ‘గంగూబాయి కఠియావాడి’, ‘బాదాయ్‌ దో’ చిత్రాలకు అవార్డులు వరించాయి.. ఈ రెండు చిత్రాలకే ఎక్కువ అవార్డులు వచ్చాయి..ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా ఏకంగా 9 విభాగాల్లో ‘గంగూబాయి కఠియావాడి’ చిత్రం అవార్డులను సొంతం చేసుకోగా,, ఉత్తమ నటుడు సహా ఆరు కేటగిరీల్లో ‘బాదాయ్ దో’ సినిమా అవార్డులు గెలుచుకుంది..

ఉత్తమ చిత్రంగా ‘గంగూబాయి కఠియావాడి’ ఎంపిక కాగా, ఇదే సినిమాకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడిగా, కథానాయికగా చేసిన అలియా భట్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు..‘బదాయ్ దో’ సినిమాకు గాను రాజ్‌కుమార్ రావ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు..ఇదే సినిమాలో నటించిన షీబీ చద్దా ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది..అలాగే ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్) సంజయ్ మిశ్రా (వధ్), ఉత్తమ నటి (క్రిటిక్స్) టబు (భూల్ భులయా 2), భూమి పెడ్నేకర్ (బదాయ్ దో), ఉత్తమ సహాయ నటుడిగా జగ్‌జగ్ జీయో సినిమాకు గాను అనిల్ కపూర్ అవార్డులు అందుకున్నారు..భాషతో సంబంధం లేకుండా యువతను విశేషంగా అలరించిన ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1’లోని ‘కేసరియా’ పాటకు ఉత్తమ సాహిత్య, గాయకుడి అవార్డులు వరించాయి..అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం ఇక్కడ గమనించ తగ్గ గమనార్హం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *