అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ

అమరావతి: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూపునకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడుతోందంటూ జర్మనీకి చెందిన (బ్లాక్ మొయిల్ చేయడం,,దొంగ రిపొర్టులను సృష్టించి షేర్లను కొనుగొలు చేసే) హిండెన్ బర్గ్ సంస్ధ ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన  సుప్రీంకోర్టు కమిటీ,,అదానీ గ్రూప్‌ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేసింది.. అదానీ గ్రూప్ సంస్థ సెబీ నియంత్రణలో దాటిపోయిందని చెప్పడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పేర్కొంది..అదానీ గ్రూప్ నుంచి షేర్ల ధరల తారుమారు జరగలేదని పేర్కొంది..హిండెన్ బర్గ్ రిపోర్టు తరువాత రిటైల్ పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు అదానీ గ్రూప్ తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు కమిటీ సమర్ధించింది..రిటైల్ పెట్టుబడిదారులను ప్రయోజనాలు కాపాడేందుకు అదానీ గ్రూప్ అవసరమైన చర్యలు తీసుకుందని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ పేర్కొంది..అదానీ గ్రూప్ తీసుకున్న ఉపశమన చర్యలు స్టాక్‌ మార్కెట్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడ్డాయని తెలిపింది..ఈ చర్యలతో  అదానీ గ్రూప్ స్టాక్‌లు స్థిరంగా ఉన్నాయని,,వ్యాపారంలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది..అదానీ గ్రూప్ కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్,, సంబంధిత పార్టీల నుంచి పెట్టుబడుల విషయంలోనూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పపడలేదని అభిప్రాయపడింది.. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌కు సంబంధించి నియంత్రణ వైఫల్యం కూడా ఏమీ లేదని తెలిపింది.. 

లాభాల బాటలో ఆదానీ షేర్లు:- హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ సంస్థలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు మార్చిలో  రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటైంది..ఇందులో సభ్యులుగా ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవధర్, కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్‌లను చేర్చింది..ఈ కమిటీ తన నివేదికను ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించింది..ఈ నివేదికలను సుప్రీంకోర్టు శుక్రవారం పబ్లిక్ డొమైన్ లో వుంచింది.. సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వెంటనే అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ధరలు అమాంతం పెరిగాయి..మధ్యాహ్నం సెషన్లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా లాభపడ్డాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *