AMARAVATHI

రోజు రోజుకు పెరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ అప్పులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వివిధ పద్దుల క్రింద చేస్తున్న అప్పులపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు..2019 తో పోల్చితే,, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపు రెండింతలయ్యాయి.. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్  అప్పు రూ.4, 42, 442 కోట్లు అని పంకజ్ చౌదురి తెలిపారు..2019లో అప్పు రూ.2,64, 451 కోట్లు కాగా 2020లో రూ.3,07, 671 కోట్లు,, 2021లో రూ.3,53,021 కోట్లు,,2022 లో రూ.3,93,718 కోట్లు,,2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరిందని తెలిపారు..బడ్జెట్ లో చూపిస్తున్న అప్పులకు తోడుగా, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు అదనమని కేంద్ర మంత్రి వెల్లడించారు..2018లో కేంద్రం సవరించిన FRBM చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు GSDPలో 20 శాతం మించకూడదు..అయితే  రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఉండాల్సిన పరిమితి కంటే 55 శాతం ఎక్కువగా ఉన్నాయి..చెల్లించాల్సిన బిల్లులతో కలిపి గత ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ప్రభుత్వ అప్పులు రూ.1,04,000 కోట్లకు చేరాయి..అయినా కొత్త అప్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *