DISTRICTS

వీధికుక్కలకు యాంటి రాబిస్ టీకాలు- కమిషనర్ వికాస్

నెల్లూరు: వీధికుక్కల కాటునుంచి ప్రజలకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి కుక్కలకు యాంటి రాబిస్ టీకాలు అందిస్తున్నామని కమిషనర్ వికాస్ మర్మత్ వెల్లడించారు. స్థానిక బాలాజీ నగర్ కాంతమ్మ ఆశ్రమం సమీపంలోని సచివాలయం వద్ద వీధికుక్కలకు రాబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని కమిషనర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీధి కుక్కల సమస్యలపై 9553219996 నెంబరుకు సమాచారం అందించాలని సూచించారు. టీకాలు వేసిన అనంతరం ఆయా కుక్కలను స్థానిక ప్రదేశంలోనే వదిలేస్తారని, దుందుడుకు స్వభావం ఉన్న కుక్కలను టీకాల తర్వాత కొద్దిరోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారని కమిషనర్ తెలిపారు. డివిజన్లలోని స్థానిక కార్పొరేటర్ల సహకారంతోనే వీధి కుక్కలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సుజాత, శ్రీకాంత్ రెడ్డి, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్, శానిటేషన్ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *