DISTRICTS

డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలి-కలెక్టర్

నెల్లూరు: ప్రజలందరూ డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి, సైబర్ నేరగాళ్ల మోసాల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లాకలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని జి పి ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు డిస్టిక్ లీడ్ కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు, అంతర్గత ఫిర్యాదుల పరిష్కారంపై జాతీయ సమగ్ర అవగాహన సదస్సును హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిర్వహించింది. ఈ అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ విజయరావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాలామంది వినియోగదారులు ఇంకా పాత పద్ధతులను వాడుతున్నారని, భయాలు, అపోహలు వీడి బ్యాంకింగ్ సేవల్లో వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.ప్రభుత్వం కూడా అనేక రకాల సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా బ్యాంకు ఖాతాలోని జమ చేస్తుందని, ప్రజలందరూ ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన కలిగి సులభతర బ్యాంకింగ్ సేవలు అలవాటు చేసుకోవాలన్నారు.అనంతరం ఎస్పీ, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి జరుగుతున్న ఆన్లైన్ మోసాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా తెలిపి, ప్రజలు  మోసాలబారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు..తొలుత డిస్టిక్ లీడ్ బ్యాంకు మేనేజర్ టంగుటూరి శ్రీకాంత్ ప్రదీప్ మాట్లాడుతూ బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఆర్.బి.ఐ సూచనల మేరకు అవగాహన సదస్సులు చేపడుతున్నట్లు చెప్పారు. బ్యాంకు  లావాదేవీల పై ఏదైనా సమస్యలు ఉంటే బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయాలని, అన్ని రకాల బ్యాంకింగ్ సమస్యలకు  వన్ నేషన్- వన్ అంబుడ్స్ మాన్ నినాదంతో ఒకే పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

17 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

20 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

21 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

21 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.