AMARAVATHIHYDERABAD

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజెపీనే-అమిత్ షా

బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు..

హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజలను నమ్మించి,గత 9 సంవత్సరాలుగా BRS అవినీతి పాలన సాగిస్తోందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో BJP ప్రభుత్వం కొలువుతీరడం ఖాయమని కేంద్రహోంశాఖమంత్రి,,బీజేపీ అగ్రనేత అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు..అదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు..తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా వద్దా?.. ఢిల్లీలోని ప్రధాని మోదీకి వినపడేలా ప్రజలు నినాదించాలని అని అమిత్‌షా పిలుపునిచ్చారు..పేపర్‌ లీకేజీపై ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ని అరెస్ట్‌ చేస్తారా? ఆయన ఏం తప్పు చేశారని అరెస్ట్‌ చేశారు? అంటూ మండిపడ్డారు.. తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్‌ లీక్‌ అవుతోందని, పేపర్‌ లీకేజీలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదని నిలదీశారు..పేపర్‌ లీక్‌ ఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. అక్రమ అరెస్ట్‌లకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు..తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు..రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదని,,కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలను మోదీ నుంచి దూరం చేయలేరని అమిత్‌షా తేల్చిచెప్పారు..కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారని,,ప్రధాని సీటు ఖాళీగా లేదని తెలుసుకోవాలన్నారు.. BRS కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉందని,,అందుకే, ఓవైసీ ఎజెండానే కేసీఆర్‌ అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *