AMARAVATHICRIME

BSP MP అఫ్జల్ అన్సారీకి రూ.లక్ష జరిమానాతోపాటు నాలుగేళ్ల జైలు శిక్ష

మాజీ ఎమ్మేల్యేకి 10 ఏళ్లు జైలు శిక్ష..

అమరావతి: రాహుల్ గాంధీ తరువాత BSP MP అఫ్జల్ అన్సారిపై లోక్‌ సభ సభ్యత్వానిపై అనర్హత వేటు పడనుంది.. 2005 లో మాజీ MLA కృష్ణా నందరాయ్ హత్య సహా నందకిషోర్ రుంగ్తా హత్య కేసులో ఇద్దరు సోదరులు (మాజీ MLA)ముక్తార్ అన్సారీ,, అఫ్జల్ అన్సారీ (ప్రస్తుత MP) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు..ఉత్తరప్రదేశ్ ఘజిపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు, శనివారం (గ్యాంగ్ స్టర్ యాక్ట్ క్రింద) హత్య కేసులో BSP MP అఫ్జల్ అన్సారీకి రూ.లక్ష జరిమానాతోపాటు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.. అఫ్జల్ యూపీ ఘాజిపూర్ లోక్ సభ BSP MPగా ఉన్నారు.. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద 2007లో నమోదైన కేసులో మాజీ MLA ముఖ్తార్ అన్సారీకి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది..అఫ్జల్‌, లోక్‌సభ సీటును కోల్పోవాల్సి రావడంతో ఈ తీర్పు కీలకమైనది..అన్సారీ సోదరులపై కిడ్నాప్, హత్య కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఘాజీపూర్ కోర్టు వెలుపల నేడు పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *