AMARAVATHINATIONAL

పాకిస్తాన్ ఉగ్రమూకలను మట్టుపెట్టేందుకు భద్రతదళాలకు బుల్ డోజర్లు

అమరావతి: పాకిస్తాన్ నుంచి భారత సరిహద్దు గ్రామల్లో ఆక్రమంగా చొరబడే ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు సైనికులకు అందుబాటులోకి వచ్చాయి..రక్షణశాఖ, భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను అప్పగించింది.. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని మట్టుపెట్టేందుకు ఈ బుల్‌డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.. ఉగ్రమూకలు, బుల్లెట్లు, బాంబులతో దాడులు జరిపినా అందులో వుండే సైనికులకు ఎలాంటి హాని జరగకుండా తయారీ చేశారు..అత్యవసర పరిస్థితుల్లో సైనికులు సురక్షితంగా ఉండేందుకు వీటిలో బంకర్‌ లాంటి వసతి ఏర్పాటు చేశారు..

ఈ బుల్డోజర్లకు యాంటీ టెర్రర్‌ బుల్‌డోజర్‌గా పేరు పెట్టారు. దీన్ని క్రైసిస్‌ సిచ్యూయేషన్‌ రెస్పాన్స్‌ వెహికిల్‌ లేదా CSRV అని కూడా అంటారు..వీటిలో రెండు రకాల CSRV లను జమ్ము కశ్మీర్‌లోని భద్రతా బలగాలకు అప్పగించారు..ఒకటి పెద్దదిగా మరొకటి ఉంటుంది..ఇంకొకటి చిన్న,చిన్న వీధులోకి సైతం సులువుగ వెళ్లేందుకు తయారు చేశారు..పెద్ద CSRV తయారీ కోసం పెద్ద JCBని మాడిఫై చేశారు..Grade 4 మెటల్‌తో దీన్ని రూపొందించారు..దీంట్లో నలుగురు సైనికులు, ఒక కమాండర్‌, ఒక ఆపరేటర్‌ కూర్చొవటానికి వీలుగా ఉంటుంది..ఉగ్రవాదులను మట్టుపెట్టేలా ఫైరింగ్‌ కోసం ప్రత్యేకమైన పాయింట్స్‌ ఏర్పాటు చేశారు..CSRV 180 నుంచి 360 డిగ్రీల వరకు తిరుగుతుందని,,18 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఇది పైకి లేస్తుందని CRPF కమెండెంట్ MS భాటియా తెలిపారు..ఇందులో నైట్‌విజన్‌ కెమెరా, లైట్లు ఉన్నాయి. కెమెరాలో చూస్తు కమాండర్‌- సైనికులకు ఆదేశాలు ఇచ్చే ఏర్పాట్లు ఉన్నయన్నారు..అలాగే అత్యధునిక టెక్నాలాజీని ఉపయోగించి ఇందులో అమర్చిన థర్మల్‌ కెమెరాల ద్వారా గోడ అవతలి వైపు కూడా చూడవచ్చని,,అక్కడి నక్కి ఉండే ఉగ్రవాదులను మట్టుబెట్టవచ్చని తెలిపారు..కాశ్మీరు లాంటి ప్రాంతాలను దృష్టిలో వుంచుకుని స్వదేశంలో తయారు చేయడం జరిగిందని,,ప్రస్తుతం ఇటువంటి బుల్డోజర్లు రెండు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు..ఈ బుల్డోజర్లు మాకు అందుబాటులోకి వచ్చినప్పటినుంచి సైనికులకు ఎంతగానో సహాయంగా ఉన్నాయని,,ఇవి వచ్చిన తరువాత చాలా సంఘటనల్లో ఉగ్రవాదులపై పై చెయ్యి సాధించడం జరిగిందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *