AMARAVATHI

రాష్ట్రంలో మారనున్న రాజకీయ పొత్తుల లెక్కలు-అమిత్ షా ను కలవనున్న చంద్రబాబు ?

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం(నేడు) సాయంత్రం ఢిల్లీకి వెళ్లి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు.ఇప్పటికే అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వటంతో సాయంత్రం ఢిల్లీ వెళ్లిన వెంటనే ఆరుగంటలకు షాతో భేటీ కానున్నారు..ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అవసరాల కోసం పొత్తులు, విభజన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచరం..2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు,, తదనంతరం జరిగిన పరిణామాలతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు..ఇటు బీజెపీతో అటు జనసేనతో పొత్తులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో ఒంటరిగా ఎన్నికలుకు వెళ్లి ఘోర పరాజయం పాలైయ్యారు..తరువాత కాలంలో చంద్రబాబు బీజేపీతో కలిసిందిలేదు..అధికారికంగా కాకపోయినా ఓ సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోదీతో కొంత సేపు ముచ్చటించారు.దానికి మించి బీజేపీతో ఎటువంటి సత్సంబంధాలు లేవు..ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి అమిత్షాతో భేటీ కాబోతున్నారు..

తెలంగాణలో టీడీపీకి ఇప్పటికి కొంత ఓటు బ్యాంకు వుంది..ప్రస్తుత పరిస్థితిలో అటు బీజెపీకి ఇటు టీడీపీకి ఒకరితో ఒకరికి పొత్తుల అవసరం వుంది..ఇదే సమయలో జనసేన కూడా తెలంగాణలో కలసి వస్తే,,ఏదైన జరగవచ్చు అన కోణంలో నేతల ఆలోచనలు,అంచనాలు వున్నట్లు తెలుస్తొంది..ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్లేందుకు వెళ్లెందుకు టీడీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తొంది..అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా వుండాలంటే,,టీడీపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.. దీని కోసం బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని ఒక సందర్బంలో పవన్ వ్యాఖ్యనించారు..ఇలాంటి రాజకీయ పరిణామలు చోటు చేసుకుంటున్న ఇటువంటి తరుణంలో చంద్రబాబు సడెన్ గా ఢిల్లీ వెళ్లటం,, అమిత్ షాతో భేటీ కావటం రాజకీయంగా ప్రాధాన్య సంతరించుకుంది..రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిదే మరి.?

రాష్ట్రంలో మోదీ 9ఏళ్ల పాలనపై రెండు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది..8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు..10న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *