INTERNATIONAL

శ్రీలంక  హంబన్ టొట పోర్టుకు చేరుకున్న చైనా స్పై షిఫ్

అమరావతి: సముద్రజలాల్లో పరిశోధనల పేరిట,,గూఢచర్యం చేసే, చైనా స్పై షిఫ్ యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టొట పోర్టుకు చేరుకుంది..స్పై షిఫ్ పోర్టుకు చేరుకున్నట్లు హార్బర్ కెప్టెన్ నిర్మల్ డిసెల్వ తెలిపారు..ఈ స్పై షిప్, భారతదేశ రక్షణ వ్యవస్థలకు సంబంధించిన వివరాలపై ఆరాతీసేందుకు ప్రయత్నిస్తదని,,ఈ స్పై షిప్ రాకను భారత్ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది..దీనిపై స్పందించిన లంక అధికారులు యువాన్ వాంగ్-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనాను కోరారు.. శ్రీలంక సూచన మేరకు షిప్ రాక వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా,, గతవారం యువాన్ వాంగ్ హంబన్ టొట దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు భారత్ గుర్తించింది.. ప్రయాణంను ఎందుకు వాయిదా వేయాలంటూ, శ్రీలంక ప్రభుత్వాన్ని చైనా అధికారులు ప్రశ్నించడంతో,, వారు సరైన వివరణ ఇవ్వలేకపోయినట్లు సమాచారం..దీంతో శనివారం షిప్ రాకకు శ్రీలంక అనుమతి మంజూరు చేసింది..శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఆఫ్ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్లు లంక అధికారులు తెలిపారు..లంక జలాల్లో ఎలాంటి సర్వేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు..ఈనెల 16 నుంచి 22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని లంక అధికారులు తెలిపారు..పొరుగు దేశాలతో భద్రత, సహకారం తమ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.. చైనా,,హంబన్ టొట పోర్టు అభివృద్ధికి 1.2 బిలియన్ డాలర్ల రుణం శ్రీలంకకు ఇచ్చింది..అయితే శ్రీలంక సకాలంలో రుణం చెల్లించలేకపోవడంతో చైనా ఈ పోర్టును 99 సంవత్సరాల లీజుకు తీసుకుంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *