AMARAVATHI

పొరపాట్లకు తావివ్వకుండా ఓటరు జాబితా సవరణ పటిష్టంగా నిర్వహించాలి-కలెక్టర్

నెల్లూరు: ఇంటింటి సర్వే నూటికి నూరు శాతం పూర్తి చేసి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్, సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, అధికారులతో సమావేశమై ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమము-2024కు సంబంధించిన పురోగతిపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సర్వే,,ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించి  స్వచ్చమైన ఓటరు జాబితాను రూపొందించడంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల పాత్ర కీలకమన్నారు.  ఎన్నికల కమీషన్ జారీచేసిన మార్గదర్శకాలకు క్షుణ్ణంగా చది ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన భాద్యత 100 శాతం ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలపై ఉందన్నారు.జనాభా-ఓటరు రేషియో పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓలను ఆదేశించారు. ప్రతి వారం మంగళవారం రోజున నియోజకవర్గ పరిధిలో అన్నీ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సంబంధిత సమావేశం మినిట్స్  రిజిస్టర్ ను కచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఒక ఇంటి నెంబర్ లో లేదా ఒక వీధిలో ఉన్న ఓటర్ల అందరు ఒకే  పోలింగ్ బూత్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఓటరుగా అతని పేరు ఓటరు జాబితా నుండి తొలగించాల్సివుంటే ఈ కారణం చేత తొలగించడం జరిగిందో స్పష్టమైన కారణాలను నమోదు చేయాలని స్పష్టం చేసారు. ఓటరు నమోదు, మార్పు లేదా తొలగింపు కొరకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత ఈఆర్ఓ, ఎఈఆర్ఓలు జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. జిల్లాలో ఓటర్ల జాబితా తనిఖీ ప్రక్రియలో ఈఆర్వోలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలన్నారు. 1400 కంటే ఎక్కువగా ఓట్లు ఉన్న పోలింగ్ బూత్ రేషనలైజేషన్ కింద మార్పులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు అధికారులు కృషి చేయాలని, ఇందుకు ఈఆర్ఓలు క్షేత్రస్థాయి బీఎల్ఓలను సమన్వయం చేసుకుని ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

14 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.