AMARAVATHI

మారింతం భీకరంగా మారనున్న బిపొర్ జాయ్ తుపాను-ఐఎండీ

అమరావతి: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపొర్ జాయ్ తుపాను కారణంగా రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఎలాంటి ప్రభావం చూపించలేక పోతున్నాయ..ఈ నేపధ్యంలో బిపొర్ జాయ్ తుపాను రాబోయే  మరో 36 గంటల్లో మరింత బలపడి గుజరాత్ లొని కచ్,, పాకిస్థాన్ లొని కరాచీల్లో ఈనెల 15వ తేదీన తీరం దాటే అవకాశం వుందని భారత వాతావరణశాఖ తెలిపింది..ఈ నేపథ్యంలో గుజరాత్ తీర ప్రాంత వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అల్టర్ జారీ చేసింది..గుజరాత్,,కర్ణాటక,, గోవాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. మహారాష్ట్ర,,తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తోంది.. బిపొర్ జాయ్ తుఫాన్ ప్రభావంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి..ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన తుఫాను గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది..తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది..లోతట్టు ప్రాంత ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సెంటర్లోకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు..బీపోర్ జాయ్ తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బలమైన గాలులు వీస్తున్నాయి..దీంతో ముంబై ఎయిర్ పోర్ట్ లో విమాన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.. గాలుల తీవ్రత కారణంగా కొన్ని విమానాల రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.. కొన్నివిమానలను ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ చేసే పరిస్థితి లేక మరో ఎయిర్ పోర్టుకు మళ్లీంచిన్నట్టు అధికారులు తెలిపారు..వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ముంబై ఎయిర్ పోర్ట్ లోని 09/27 రన్ వేను తాత్కాలికంగా మూసివేసినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ వెల్లడించింది..

Spread the love
venkat seelam

Recent Posts

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

24 mins ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

2 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

2 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

20 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

This website uses cookies.