DISTRICTS

అందరి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా-జిల్లా కలెక్టర్ హరి నారాయణన్

బాధ్యతలు స్వీకరణ..

 నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  అభివృద్ధి, సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన అన్నీ వర్గాల  ప్రజలకు అందించడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు,  మీడియా అందరి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి  కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ పేర్కొన్నారు..బుధవారం ఉదయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమైన రామాయపట్నం పోర్టు,  ఫిషింగ్ హార్బర్ తదితర ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి  కార్యాచరణ అమలు చేసి రాష్ట్రంలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని కలెక్టర్ వివరించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *