AMARAVATHINATIONAL

బ్రిటన్ కు నొప్పి తెలిసిందా-ఎంబసీ ముందు బారికేడ్లు తొలగింపు

దెబ్బకు దెబ్బ…

అమరావతి: గతంలో లాగా భారత్ కు ఎక్కడ అవమానం జరిగిన తలవంచుకుని వెళ్లె పరిస్థితి లేదని,,దెబ్బకు దెబ్బ అన్న చందన చాలా విషయాల్లో భారత్ తీవ్రంగా స్పందిస్తొంది అనే విషయం ప్రపంచ దేశాలకు బాగా ఆర్దమౌతొంది..ఈ నేపధ్యంలో…ఇటీవల బ్రిటన్ రాజధాని లండన్లోని భారత హైకమిషనరేట్ ముందు ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు తొలగించే ప్రయత్నం చేసిన విషయం విదితమే..త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఖలిస్తానీ జెండా ఎగరవేద్దామనుకున్నప్పటికి,రాయబార కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది అడ్డుకోవడంతో, ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది..ఈ చర్యలో ఖలిస్తానీ మద్దతుదారుల అరాచకత్వం కనిపిస్తూనే ఉన్నప్పటికీ,, బ్రిటన్ ప్రభుత్వం నిర్వహణాలోపం కూడా స్పష్టంగానే కన్పిస్తొంది..లండన్లో భారత్కు జరిగిన ఈ అవమానానికి ప్రతిచర్య బలంగానే తెలిసింది..ఢిల్లీ చాణక్యపురి ఎన్‌క్లేవ్‌లోని శాంతిపథ్ వద్ద బ్రిటన్ ఎంబసీ వెలుపల ఉంచిన సిమెంట్ దిమ్మెలను రాజాజీ మార్గ్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ నివాసం వరకు తొలగించారు.. ఆదివారం నాడు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల జరిగిన హింసాత్మక నిరసనపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి అంచనాను అనుసరించి ఈ పరిణామం చోటు చేసుకుంది..ఈ చర్యపై ఇండియాలోని బ్రిటన్ హైకమిషనర్ స్పందిస్తూ తాము భద్రతా విషయాలపై వ్యాఖ్యానించమన్నారు..ఈ విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. లండన్లోని భారత హైకమిషనరేట్ ముందున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించే ప్రయత్నం జరిగిన చాలా సేపటి తరువాత లండన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొలేదు..ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తల నుంచి మరిన్ని నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశాలపై బ్రిటన్ అధికారులతో భారత ఇంటెలిజెన్స్ విభాగం చర్చించినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులు హైకమిషన్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించడంపై భారత్ వివరణ కోరింది..ప్రతి ఒక్కరిని గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *