చుక్కల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాం-జిల్లా కలెక్టర్
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాకు సంబంధించి సుమారు 43270 ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించామని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ గురువారం తెలిపారు. దీనివల్ల 18 వేలమంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం GO MS NO-163 ను విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు.