AMARAVATHI

ఈనెల 16న విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు జారీచేసిన ఈడీ

అమరావతి: BRS MLC,K.కవిత విచారణ నేటికి పూర్తి అయింది..ఈనెల 16న విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమెను ఉదయం 11:30 గంటలకు నుంచి రాత్రి 8:00 గంటల వరకు కొనసాగింది..కవితను విచారించడానికి ముందే ఆమె ఫోన్ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర,, నిందితులతో ఉన్న సంబంధాలు,, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,, 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడి ప్రశ్నించినట్లు సమాచారం.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు,, సేకరించిన  సాక్ష్యాలను అమె ముందు వుంచి కవితను ఈడీ విచారించినట్లు తెలుస్తోంది.. మౌఖికంగా,,రాతతపూర్వకంగా కవిత స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు..అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా ఇచ్చిన సమాచారాన్ని కూడా విచారణకు ఈడీ ఉపయోగించుకుంది.. ఢిల్లీ పోలీసులు కవిత తప్పించి వేరే ఎవరినీ లోనికి అనుమతించలేదు..ఈడీ కార్యాలయం చుట్టు ప్రక్కల 144 సెక్షన్ విధించారు..కవిత వెంట వచ్చిన భర్త అనిల్, అడ్వొకేట్లను కూడా పోలీసులు బయటే నిలిపివేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *