AMARAVATHICRIME

బ్రిటీష్ మీడియా సంస్థ BBC ఇండియాపై ఫెమా యాక్ట్ కేసు నమోదు

అమరావతి: విదేశీ మారక ద్రవ్యం నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రిటీష్ మీడియా సంస్థ BBC ఇండియా పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్(ED) మేనేజ్మెంట్ యాక్ట్ కేసు నమోదు చేసింది..ఫెమా నిబంధనల ప్రకారం కొంతమంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం కోసం ఈడీ పిలిపించింది..ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఈ.ఢీ అధికారిక వర్గాలు వెల్లడించాయి..కంపెనీ చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఉల్లఘనలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ-ముంబైలోని BBC కార్యాల్లో ఈ.డీ చేపపెట్టిన సర్వే ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు..BBC వార్తా సంస్థ చూపుతున్న ఆదాయం లాభాల్లో తేడాలు ఉన్నాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ (CBDT) తెలిపింది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు, BBC ఉద్యోగులు ఇచ్చిన వివరాలు డిజిటల్ ఆధారాలు పత్రాల ద్వారా కీలకమైన విషయాలను వెలికి తీశారు.. డాక్యుమెంటేషన్ బదిలీ,ధరలకు సంబంధించి అనేక వ్యత్యాసాలు అసమానతలు ఉన్నాయి అని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *