AMARAVATHIHEALTH

కరోనాపై ఆప్రమత్తమైన కేంద్రం-ఏప్రిల్ 10,11 తేదిల్లో మాక్ డ్రిల్స్

అమరావతి: దేశంలో మరోసారి కరోనా కేసుల పెరుగదల అలజడి సృష్టిస్తొంది..కేసుల పెరుగుదలపై వెంటనే ఆప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు సిద్దమౌవుతొంది..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కేంద్రం ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు హెచ్చరికాలు జారీ చేసింది..ఇందులో భాగంగానే సోమవారం రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది..కేసులు ఉన్నపళంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..తాజాగా దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు నమోదుకాగా, వైరస్‌ కారణంగా ఆరుగురు మృతి చెందారు..146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి..గత ఐదువారాల్లో దేశంలో కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది..ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని 4-T (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌-టీకా)పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది..దేశంలో పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16 సబ్‌వేరియంట్‌గా భావిస్తున్నారు..ఢిల్లీలో శుక్రవారం 152 కొత్త కరోనావైరస్ కేసులు 6.66 శాతం పాజిటివ్ రేటుతో నమోదయ్యాయి..అంతకుముందు అక్టోబర్‌లో ఢిల్లీలో ఒకే రోజులో 100 కేసులు నమోదయ్యాయి..మహారాష్ట్రలోనూ శుక్రవారం 343 కొవిడ్‌ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు.. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,763కి చేరింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *