AGRICULTUREAMARAVATHI

ఉద్యాన పంటలను మరింతగా ప్రోత్సహించి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో ఉద్యాన పంటలను మరింతగా ప్రోత్సహించి రైతులకు సుస్థిరమైన ఆదాయం అందేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను( ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్) అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు..గురువారం  కోవూరు మండలం, లేగుంటపాడులోని ప్రగతి యువ కేంద్రం రైతు ఉత్పత్తిదారుల సంఘం కేంద్రాన్నికలెక్టర్,వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ తో కలసి సందర్శించారు.ఈ సంధర్భంగా ప్రగతి యువ కేంద్రం రైతు ఉత్పత్తిదారుల సంఘంలో అమలు అవుతున్న కార్యకలాపాలను, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్ సదుపాయాలు తదితర విషయాల గురించి జిల్లా కలెక్టర్ సంఘం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో  ఉద్యాన పంటలను, దాని అనుబంధ రంగాలను మరింతగా ప్రోత్సహించే విధంగా కన్వర్జెన్సీ మోడ్ లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ను ఏర్పాటు చేసి రైతులకు సుస్థిరమైన ఆదాయం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *