AMARAVATHIDISTRICTS

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తాం-కమిషనర్ వికాస్

నెల్లూరు: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గృహ వ్యర్ధాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని కమిషనర్ వికాస్ మర్మత్ హెచ్చరించారు. స్థానిక  పొదలకూరు రోడ్, క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని 34/1,34/2 సచివాలయాల్లో శానిటేషన్ మస్టర్ పాయింట్లను కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయంలో ఇన్స్పెక్షన్ రిజిస్టర్ తో పాటు స్పందన రిజిస్టర్ ను సరిగా మైంటైన్ చేయాలని సూచించారు. వసూలు చేసిన పన్నులను సకాలంలో డిపాజిట్ చేయాలని, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సచివాలయ ప్రాంగణంలో ప్రదర్శించాలని కమిషనర్ ఆదేశించారు. డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరును పరిశీలించి కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేసారు. స్థానిక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి మంచినీరు సరఫరా అగు జంక్షన్ సమీపంలో రోడ్డు గుంతలమయంగా ఉన్నట్లు గమనించిన కమిషనర్ వెంటనే మరమ్మతులు చేపట్టి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమిస్తూ ఉన్న భవన నిర్మాణ సామగ్రిని తొలగించేందుకు భవన యజమానులకు నోటీసులు జారి చేయాలని సూచించారు. అదేవిధంగా సచివాలయం పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారి చేయాలని కమిషనర్ ఆదేశించారు. యజమానులు వారి ఖాళీ స్థలాలను శుభ్రం చేసుకుని దోమల నిర్మూలనకు, ప్రహరీ గోడలు నిర్మించుకుని ఆక్రమణలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని అవగాహన కల్పిస్తూ సచివాలయాల పరిధిలోని ప్రతీ ఇంటికి నోటీసులు అందించాలని సానిటరీ సిబ్బంది మరియు కార్యదర్శులను  కమిషనర్ ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *