AMARAVATHIINTERNATIONAL

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్?

అమరావతి: పాకిస్తాన్ ఆర్మీ డైరెక్షన్స్ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు సిద్దమైయ్యారు..ఆయనపై దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. జమాన్ పార్క్‌ లోని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) కార్యకర్తలు గుమిగూడారు..ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు వీలు లేదంటూ నిరసనలకు దిగారు..

తోషాఖానా అంటే ఖజానా అని అర్థం..ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ,,కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తోంటుది..అధికారంలో వుండే ప్రెసిడెంట్,,ప్రైమినిస్టర్ లకు,, అధికారులకు వచ్చే బహుమతులను తోషాఖానా ఉంచుతారు..బహుమతుల విలువ రూ..30,000 కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి దానిని తమ వద్దే ఉంచుకోవచ్చు..అంతకంటే  ఎక్కువ ఖరీదు అయితే  చట్టం ప్రకారం తోష్‌ఖానాలో ఉంచాలి.. ఇమ్రాన్ ఖాన్ ప్రైమినిస్టర్ గా ఉన్న టైమ్ లో  ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించలేదని,,కొన్ని తన వద్ద ఉంచుకొవడం,,మరి కొన్ని అమ్మివేయడం జరిగిందన్న ఆరోపణలపై కేసు నమోదయ్యాయి. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *