DISTRICTS

కస్తూర్బా బాలికల విద్యాలయం ఆవరణంలో చేనేత ఎగ్జిబిషన్-కలెక్టర్

నేతన్నలను ప్రోత్సహించాలి..

నెల్లూరు: నగరంలోని కస్తూరిదేవి బాలికల విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను జిల్లా ప్రజలందరూ సందర్శించి, విరివిగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కళాకారుల వృత్తి, నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ చక్రధర్ బాబు కోరారు..ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని  కస్తూర్బా బాలికల విద్యాలయం (రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్)లో నాబార్డు సహకారంతో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయ దుకాణాలను కలెక్టర్ ప్రారంభించారు..ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 30 చేనేత వస్త్రాల విక్రయ స్టాళ్లతో కస్తూరి దేవి బాలికల విద్యాలయంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల నుంచి పేరెన్నికగల కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారన్నారు. ప్రాచీన కళలు మరుగున పడిపోకుండా, చేనేత కార్మికులకు అండగా, వారి శ్రమకు గుర్తింపు, గౌరవం ఇస్తూ ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాలను ప్రజలందరూ కొనుగోలు చేయాలని కోరారు.సుమారు 300 గంటలపాటు మగ్గం మీద కార్మికుడు శ్రమిస్తే ఒక చీర తయారవుతుందని, అదే పవర్ హ్యాండ్లూమ్స్ మిషన్ల ద్వారా మూడు నిమిషాల్లో తయారయ్యే చీర ఎక్కువ కాలం మన్నిక ఉండదని, అదే మగ్గం మీద నేసిన చీర ఎంతో నాణ్యంగా ఉంటుందని, నేతన్న కష్టానికి ప్రజలంతా తమ సహకారం అందించి వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని అధికారులంతా తప్పకుండా చేనేత వస్త్రాలు ధరించి రావాలన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

4 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

8 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

13 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

This website uses cookies.