INTERNATIONAL

రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కోసం నా ప్రయత్నం చేస్తాను-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జపాన్ లో తొలిసారి సమావేశమయ్యారు..జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సుకు అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు..ఈ సందర్భంలో ప్రధాని మోదీ,,జెలెన్ స్కీతో భేటీ అయ్యారు..ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్,,విదేశంగా మంత్రి జయశంకర్ లు ఉన్నారు..18 నెలల నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి జెలెన్ స్కీతో తాను ఫోన్ లో మాట్లాడానని,, ఇప్పుడు ఆయన్ను కలిసే అవకాశం వచ్చిందని  ప్రధాని మోదీ తెలిపారు..రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఒక సమస్యగా మారిందని చెప్పారు.. ఈ యుద్ధం అన్ని దేశాలపై  అనేక రకాలుగా ప్రభావం చూపుతోందన్నారు..రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని రాజకీయ, ఆర్థిక సమస్యగా చూడటం లేదని,,మానవత్వానికి సంబంధించిన సమస్యగా భారత్ చూస్తోందన్నారు..మానవ విలువలకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు..  యుద్ధం వలన కలిగే బాధలు ఏంటో భారత కంటే ఉక్రెయిన్కే ఎక్కువ తెలుసన్నారు..యుద్ధం వల్ల భారత్ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి విద్యార్థులు చెప్పిన వివరాలు చూస్తే ఉక్రెనియన్లు అనుభవించిన బాధలను అర్థం చేసుకోగలనమన్నారు..భారత్ తరఫున,,,,తన వ్యక్తిగత సామర్థ్యం మేరకు యుద్ధానికి  పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని  జెలెన్‌స్కీకి మోడీ  భరోసా ఇచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *