AMARAVATHI

రాహుల్ గాంధీ, ప్రియాంకావాద్రాలు ప్రచారం చేస్తే,,అ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ??

హైదరాబాద్: జాతీయపార్టీ అభ్యర్దులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సదరు పార్టీ అగ్రనాయకులు అభ్యర్దుల తరపున ప్రచారం చేస్తే,,నియోజకవర్గంలో కొంత వీక్ గా వున్న అభ్యర్దికీ ఓటర్ల నుంచి మద్దుతు లభిస్తుంది అనేది జరమెరిగిన సత్యం..అయితే ఇందుకు భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంకావాద్రాలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో సొంత పార్టీ అభ్యర్థులే భయపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి..ఇందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో రాహుల్, ప్రియాంకావాద్రాలు ప్రచారం చేసిన స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోతుండటమే కారణం..2018 నుంచి 2023 వరకు జరిగిన ఎన్నికల గణాంకలు చూస్తే,, వీరిద్దరూ ప్రచారం చేసిన 95% స్థానాల్లో ఆ పార్టీ ఓటమిపాలైయింది.. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకావాద్రాలు ప్రచారం ఆ పార్టీకి ఘోర పరాభవమే మిగిలింది..ఆ పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి.. కొడంగల్ లో రాహుల్ గాంధీ ప్రచారం చేయగా అక్కడ కాంగ్రెస్అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓడిపోయారు..ఈ దెబ్బతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని మళ్లీ కొడంగల్ కు ప్రచారం కోసం పిలిచే సాహసం రేవంత్ రెడ్డి చేయడం లేదు?.. మిగిలిన నేతలు కూడా రాహుల్, ప్రియాంకావాద్రాలు ప్రచారానికి వస్తామంటేనే భయపడుతున్నరని ఆ పార్టీకి చెందిన నాయకులు గుసగుసలాడుతున్నారు..తమ నియోజకవర్గంలో అగ్రనేతల ప్రచారం అవసరం లేదని తెగసిచెప్తున్నట్టు సమాచారం..ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి తెలంగాణలో 25కు పైగా నియోజవర్గాల్లో ప్రచారం చేశారు..దీంతో అక్కడి అభ్యర్థుల్లో ఓటమి భయం పట్టుకున్నట్టు ప్రచారం సాగుతొంది..మరి ఏం జరుగుతుంది అనేది డిశంబరు మొదటి వారం వరకు అగాల్సిందే…(వీరిద్దరు) రాహుల్, ప్రియాంకావాద్రాలు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి :-
2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకుగాను కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదు.. రాహుల్ గాంధీ 12, ప్రియాంకావాద్రా 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా ఒక్కరిని కూడా గెలిపించలేకపోయారు.
2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 5 నియోజకవర్గాల్లో, ప్రియాంకావాద్రా 8 నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.
2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మొత్తం 82 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే, ఒక్క స్థానంలోనే పార్టీ విజయం సాధించింది. ప్రియాంకావాద్రా 120 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే, కాంగ్రెస్ ఒక్కచోటే గెలిచింది.
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ 45 నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా 13 స్థానాల్లో, ప్రియాంకావాద్రా 21 స్థానాల్లో ప్రచారం చేస్తే ఐదుచోట్ల మాత్రమే గెలిచింది.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

5 mins ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

5 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

20 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

24 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

24 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

2 days ago

This website uses cookies.