AMARAVATHIMOVIE

నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదు-చిరంజీవి

హైదరాబాద్: తాను క్యాన్సర్ బారినపడ్డానని, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికాను అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు..శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు..స్టార్ హాస్పిటల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదని,, ఏఐజీలో కొలనోస్కోపీ చేయించుకొని క్యాన్సర్ నుంచి బయటపడ్డానన్నారు..‘తాను ఆరోగ్యంగా ఉంటానని అనుకుంటానని, రోజు ఎక్సైర్ సైజ్ చేస్తుంటానని, హెల్తీఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు కాబట్టి నాకు ఏ జబ్బురాదులే అనుకున్నాను తెలిపారు..అలాగే నాకు ఏ చెడు ఆలవాట్లు లేవు… ఎప్పుడో స్నేహితులతో కలసి వైన్ తీసుకుంటాను…స్మోకింగ్ అలవాట్లు లేవు…దింతో ఎలాంటి క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదన్నారు..అలాంటి నేను ఏఐజీ హాస్పిటల్లో క్యాన్సర్స్ కు చికిత్స తీసుకున్నాను అని చెప్పారు.. 45 సంవత్సరాలు దాటిన తరువాత కొలన్ క్యాన్సర్ తో బాధపడ్డాను… స్టేజ్-4 మాత్రమే దీన్ని గుర్తించే అవకాశం ఉంది… ఏఐజీ వెళ్లి డాక్టర్ నాగేశ్వర్ రావును కలిశాను…పరీక్షల్లో పాలిప్స్ బయటపడ్డాయి…వెంటనే చికిత్స చేసి వాటిని తొలగించారు…క్యాన్సర్ పై అవగాహన లేకపోయి ఉన్నా…మనకు రాదులే అని మనపై మనకు నమ్మకం, నిర్లక్ష్య భావన ఉంటే.. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఎలా ఉండేదో ఉహించుకుంటే భయం వేసిందన్నారు… అభిమానుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు…హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానన్నారు…క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల కోసం స్టార్ హాస్పిటల్ తో మాట్లాడానన్నారు…జీనోమిక్స్ టెస్టుతో ముందస్తుగానే క్యాన్సర్ ను గుర్తించవచ్చని,,క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తానన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *