DISTRICTS

ఫిబ్రవరిలో జిల్లాకు ముఖ్యమంత్రి-తప్పనిసరిగా మాస్కులు-కలెక్టర్

ఇసుక అక్రమ రవాణా..

నెల్లూరు: ఫిబ్రవరి నెలలో జగనన్న లేఅవుట్ గృహాలను ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారని, ఆలోగా జిల్లాలో గృహ నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం  నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్,జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కిందజిల్లాలో రెండు వైయస్సార్ జగనన్న మెగా లే అవుట్ల లో గృహ నిర్మాణం జరుగుతోందని వాటిని ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తారన్నారు. ఆలోగా గృహ నిర్మాణ సంస్థ అధికారులతో పాటు మండల ప్రత్యేక అధికారులు రోజువారీ పురోగతిపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతము గృహ నిర్మాణాల బిల్లులు చెల్లింపు సమస్యలేదని, వర్షాల భయం లేన్నందున గృహాల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు.

AP FRS యాప్:-నేటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ద్వారానే దస్త్రాలు ప్రత్యుత్తరాలు జరపాలని,, అలాగే సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన AP FRS యాప్ ద్వారా ముఖ హాజరు తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి వేయాలన్నారు. దీనిని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులందరూ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలన్నారు.

తప్పనిసరిగా మాస్కులు:- కోవిడ్ కొత్త  వేరియంట్ BF-7 విస్తరిస్తున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఆసుపత్రులలో తప్పనిసరిగా మాస్కులు ధరించితేనే లోపలికి అనుమతించాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ నియంత్రణకు, చికిత్స కోసం వసతులు,  అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.కోవిడ్ మూడవ డోసు ఇంకా చాలామందికి వేయాల్సి ఉందని మొదటి రెండవ డోసులు మాదిరిగానే మూడవ డోసు కూడా పూర్తి చేయాలన్నారు

ఇసుక అక్రమ రవాణా:- అక్రమ మైనింగ్ నియంత్రణ కమిటీ సరిగా పర్యవేక్షించడం లేదని, ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు.  అక్రమ మైనింగ్ కు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకుని,వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలని, ఇందుకు సంబంధించిన నివేదికను వారంలోగా అందజేయాలని స్పష్టం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

14 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

17 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

17 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

18 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.