DISTRICTS

డీగ్రీ ఆర్ట్స్ కోర్సులలో ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది-జె.సి కూర్మనాథ్

నెల్లూరు: ఆర్ట్స్ కోర్సులలో ఇంటర్న్షిప్ అనే నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జాయింట్ కలెక్టర్  రోణంకి కూర్మనాథ్ పేర్కోన్నారు.గురువారం కలెక్టరేట్లోని S.R.శంకరన్ హాల్లో డిగ్రీ కళాశాలల్లో ఇంటర్న్షిప్ ప్రవేశ పెట్టే విధానంపై ఎంపిక చేసిన జిల్లాస్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క డిగ్రీ కళాశాల విద్యార్థి తమ కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుందన్నారు. వివిధ రంగాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగ పడుతుందన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగం తగ్గుతుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని ఇటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈనెల 14  తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లాలోని 49 డిగ్రీ కళాశాలల్లో చదివే 9221 మంది విద్యార్థులకు వారు చదివే సబ్జెక్ట్ లో ఇంటర్న్షిప్ చేసేందుకు పరిశ్రమలను గుర్తించాలన్నారు. ఈనెల 10వ తేదీ లోపు ఆయా రంగాలను గుర్తించి విద్యార్థులు ఎంచుకునేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాల్సిందిగా అధికారులకు సూచించారు. సిద్ధాంతపరమైన చదువుతో పాటు నైపుణ్యాలను అందిపుచ్చుకునే అవకాశం విద్యార్థులకు కలుగుతుందన్నారు.అదే సమయంలో పరిశ్రమ వర్గాల వారికి మానవ వనరుల సౌలభ్యం దొరుకుతుందన్నారు. ఆయా రంగాలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వినీల్ కుమార్, డి ఆర్ డి ఎ  పి డి సాంబశివ రెడ్డి, ఎల్ డి ఎం శ్రీకాంత్ ప్రదీప్, డి ఎం హెచ్ ఓ పెంచలయ్య, పశుసంవర్ధక శాఖ జె.డి మహేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

16 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

19 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

24 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

2 days ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

2 days ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

2 days ago

This website uses cookies.