INTERNATIONAL

హిజాబ్ ను తగులపెడుతూ,వెంట్రుకలు కత్తిరించుకుంటన్న ఇరాన్ మహిళలు

అమరావతి: ఇస్లాం దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికి,సదరు దేశాల్లో ఇస్లాంలోని ఆచారాల సంప్రదాయల విషయంలో మహిళలపై కఠినమైన ఆంక్షలు ఆమలు అవుతుంటాయి..ముఖ్యంగా హిజాబ్ విషయంలో,, మహిళలు తప్పనిసరిగా ముఖం,వెంట్రుకలు కూడా కనిపించకుండా హిజాబ్ ధరించాలనే నిబంధన వుంటుంది..ఇలాంటి కఠిన నిబంధనలను,చట్టాలను ధిక్కరిస్తూ ఇరాన్లోని మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి హిజాబ్ తొలగించి దానికి నిప్పు పెడుతున్నారు..ప్రస్తుతం ఇరాన్ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగుతోంది..అలాగే హిజాబ్ కాల్చేస్తూ, జుట్టు కత్తించుకుంటూ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు..ప్రస్తుతం సోషల్  మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది..రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వేలాది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది, మహిళలపై లాఠీ చార్జ్ చేస్తు,,టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు..సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా నెటిజెన్లు మహిళల నిరసనపై ప్రశంసలు కురిపిస్తూనే ఇరాన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు..మానవత్వానికి వ్యతిరేకంగా ఉండే మత నిబంధనలు, ఆచారాలు అక్కర్లేదని,మహిళలకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు.. మహిళల్లో ఇంతటి కోపానికి కారణం….ఇటీవల మహ్సా అమినీ అనే 22 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఇరాన్ రాజధాని టెహ్రన్కు వెళ్లింది..అయితే ఆమె హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు..ఆటు తరువాత ఏం జరిగిందో తెలియదు కాని అమెను సడెన్ గా ఆసుపత్రిలో చేర్చారు..కోమాలోకి వెళ్లిన అమినీ… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది..ఈ సంఘటనపై ఇరాన్ మహిళలు లోకం ఒక్క సారిగా భగ్గుమంది..అమినీని పోలీసులు భౌతికంగా హింసించారని, ఆమె ఒంటిపై గాయాలున్నాయని, ఆమెది ముమ్మాటికీ హత్యేనని కుటుంబీకులతో సహా మహిళలు తీవ్రంగా మండిపడ్డారు..ఈ ఘటన ప్రస్తుతం ఇరాన్ దేశాన్ని కుదిపివేస్తోంది.. ఇరాన్లో 7 సంవత్సరాలు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది..షరియా చట్టం ప్రకారం…జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే.. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలించడంతో పాటు జరిమానా విధిస్తారు..లేదంటే అరెస్ట్ చేస్తారు..అయితే ఈ నిబంధనలపై చాలా కాలంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ, దీనిని సవరించడానికి ప్రభుత్వాలు ముందుకు రావడంలేదు..నిరసన చేస్తున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి..ఈ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *