AMARAVATHI

రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు-షర్మిల

రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లు అప్పులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు..ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు..ఈ సందర్బంలో అమె మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేకహోదా కావాలంటూ డిమాండ్ చేసిన వైఎస్ జగన్,, సీఎం అయ్యాక ఆ విషయం పక్కనపెట్టారంటూ విమర్శించారు..మూడు రాజధానులు కడతానని చెబుతున్నారని, ఏపీకి కనీసం ఒక్క రాజధాని కూడా లేదన్నారు.. గత పదేళ్లలో రాష్ట్రానికి పది పరిశ్రమలైనా వచ్చాయా? అని ప్రశ్నించారు..ఉద్యోగాల ఇస్తామని చెప్పి,, ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు..ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు.. భూతద్దం పెట్టి వెతికి చూసినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని,,ఇదే సమయంలో దళితుల మీద దాడులు పెరిగాయన్నారు.. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, ముగ్గురు టీడీపీ ఎంపీలు,, మరో 6 గురు రాజ్యసభ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు.. రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు..అయితే రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని,, అప్పు తెచ్చిన లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయింటూ ప్రశ్నించారు..

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

3 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

3 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

5 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

5 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

23 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.