AMARAVATHIBUSINESS

Jio 5G సేవలు మరిన్ని నగరాల్లో అందుబాటులోకి

అమరావతిం రిలయన్స్ Jio 5G సేవలను బుధవారం మరో 27 నగరాల్లో విస్తరించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది..ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 331 నగరాల్లో Jio 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ పేర్కొంది.. కొత్తగా మరికొన్ని నగరాల్లో Jio 5G సేవలు విస్తరించిన నేపథ్యంలో వినియోగదారులను ఈ నేటి నుంచి జియో వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానిస్తున్నామని సంస్థ వెల్లడించింది.. Jio 5G సేవలను 1Gbps స్పీడుతో డేటాను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో Jio 5G సర్వీసులను మరింత విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది.అలాగే ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోపాటు మొత్తం 27 నగరాల్లో Jio 5G సర్వీసులను విస్తరించింది..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం, విజయవాడ, తిరుపతి, తిరుమల, తెనాలి, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రొద్దుటూరు, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేట, నంద్యాల, మదనపల్లి, కర్నూలు, కాకినాడ, కడప, హిందూపూర్, గుంటూరు, గుంతకల్, ఏలూరు, చిత్తూరు, చీరాల, భీమవరం, అనంతపురం, మచిలీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం నగరాల్లో Jio 5G సేవలను అందిస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది.. హైదరాబాద్‌లో Jio 5G సేవలను విస్తరించామని రిలయన్స్ జియో పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *