YSR కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..
నెల్లూరు: YSRCPకి ఆ పార్టీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లోని ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీని వీడటం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన నమూనా ఆలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసి రెండుసార్లు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేశారని గుర్తు చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 250 గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని వీపీఆర్ అందించారన్నారు.వీపీఆర్ వైసిపికి రాజీనామా చేశారని, తాను కూడా YSR కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. మార్చి 2న మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నెల్లూరు రానున్న సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులతో పాటు తాను కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.