AMARAVATHI

కాపీరైట్స్ సమస్యను ఎదుర్కొంటున్న కాంతారం సినిమా

అమరావతి:  తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి, భారీ విజయం సాధించిన కాంతార సినిమా ప్రస్తుతం కాపీరైట్స్ సమస్యను ఎదుర్కొంటుంది.ఈ రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన కాంతారం మొదట కన్నడలో విడుదల అయ్యి అక్కడ హిట్ కొట్టక ఆటు తరువాత హిందీ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది.20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులతో పాటు సినిమా తారలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు.అయితే, ఈ సినిమాలో వాడిన మ్యూజిక్ మేం కాంపొజ్ చేసిందే,, లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కన్నడలో ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. గతంలో వీరు నవరసం పేరుతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఈ మ్యూజిక్ కాంతార సినిమాలోని బాగా పాపులర్ అయిన వరాహ రూపం మ్యూజిక్ ఒకేలా ఉందని తైక్కుడం బ్రిడ్జ్ టీం ఆరోపిస్తున్నారు.

తైక్కుడం బ్రిడ్జ్ టీం తమ సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ..”మా ఆడియన్స్ కి మేము ఒకటే చెప్తున్నాము.కాంతార సినిమాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా సాంగ్ నవరసం, కాంతార లోని వరాహ రూపం సాంగ్ లో ఉన్న మ్యూజిక్ చాలా వరకు ఒకటే. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలని ఉల్లంఘించడమే అవుతుంది. కాపీ చేయడం,, ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది.ఆ మ్యూజిక్ పూర్తిగా మా సొంతం. అందుకే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. చిత్ర యూనిట్ కి లీగల్ నోటీసులు పంపిస్తున్నాం” అని తెలిపారు. అలాగే చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా ఈ పోస్ట్ ని ట్యాగ్ చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ స్పందించలేదు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

16 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

19 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

19 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

21 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.